- ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం
- నామ మాత్రపు ప్రత్యర్థుల పోటీ
- ప్రధాన ప్రత్యర్థి ఆలెక్సీ నావెల్నీ ఎన్నికలముందు మృతి
- ఐదో సారి అధ్యక్ష పీఠంపై పాగా
- ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రష్యా అధ్యక్షుడిగా మరో సారి 71 ఏళ్ళ వ్లదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దాదాపు 87 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారని రష్యన్ వార్తా సంస్థలు తెలిపాయి. రష్యా అధ్యక్షుడిగా ఆయన కు ఐదో సారి గెలుపు . దాదాపు 25 ఏళ్ళుగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎన్నికతో మరో ఆరేళ్ళు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి ఆలెక్సీ నావెల్నీ జైల్లో మృతి చెందారు. పుతిన్‌కు పోటీగా ముగ్గురు ప్రత్యర్థులు పోటీలో ఉన్నారు. పుతిన్ ను వ్యతిరేకించే ప్రత్యర్థులు సైతం ప్రవాసంలో ఉన్నారు. ఉక్రెయిన్ తో యుధ్థం వల్ల పుతిన్ పట్ల ప్రజలు కొంత వ్యతిరేకత కనబరుస్తారన్న ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా ఘన విజయం సాధించారు.
Related Stories
November 6, 2024
November 6, 2024