* కులగణన వల్లనే దేశంలో వాస్తవం రూపం వెలుగు చూస్తుంది
* ఎంఎస్పీకి చట్ట బద్దత కల్పిస్తాం.
* దేశంలో రోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు
– తుక్కు గూడ సభలో రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
మీకు నాకు ఉన్నబంధం కేవలం రాజకీయ బంధం కాదు, కుటుంబం బంధం అని అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో ఒక సైనికుడిలాగా ఉండి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతాను. జీవితాంతం నేను తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను ఇక్కడ వాలిపోతానని రాహుల్ గాంధీ తుక్కుగూడ బహిరంగ సభలో అన్నారు. రాహుల్ గాంధీఉపన్యాసం కేవలం రాజకీయాలకు సంబందించే కాకుండా తెలంగాణ ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
కొన్ని నెలల ముందే ఇదే ప్రాంతంలో జరిగిన సభలో ఆరు గ్యారంటీలను ఇక్కడే ఆవిష్కరించాం . అదీ నాకు చాలా గుర్తుంది. జాతీయ స్థాయి సంబందించి ఇపుడు ఐదు గ్యారంటీలను విడుదల చేస్తున్నాం. గ్యారంటీలు అంటే ఇవీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చ గ్యారంటీలు కావు. ప్రజా బాహుళ్యానికి సంబందించిన గుండె చప్పుళ్ళే ఈ గ్యారంటీలని రాహుల్ గాందీ అన్నారు. రూ. 500 లకే సిలిండర్ , గృహలక్ష్మీ, ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీలు అవి ప్రజల నిజమైన అవసరాలుగా గుర్తించే ప్రకటించాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం.. ఈ విషయం మీ అందరికీ తెలుసిందే. ఇపడు మేము విడుదల చేస్తున్న ఈ మేనిఫెస్టో కూడా భారత దేశ ప్రజల గుండె చప్పుళ్ళేనని రాహుల్ గాంధీ అన్నారు. పబ్లిక్,ప్రైవేట్, హెల్త్ రంగాల్లో యువతకు ఏడాది పాటు శిక్షణ అప్రెంటిషిప్ లక్ష రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. మహిళలు దేశంలో రెండు రకాల ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. బయట ఉద్యోగాలు చేస్తూ ఇంటి పనులు చేయాల్సి వస్తుందోన్నారు. వీరి కోసం ప్రత్యేక గ్యారంటీలను ఇస్తున్నామన్నారు.నరేంద్ర మోది పాలనా కాలంలో పేదరికం బాగా పెరిగిపోయింది. మహిళల కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇదీ విప్లవాత్మక అడుగుఅని అర్థం చేసుకోవాలి. దీని వల్ల భారత దేశ ముఖ చిత్రమే మారిపోతుంది. దీనితో దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ఉండే అవకాశం లేనే లేదన్నారు.
ఎంఎస్పీకి చట్ట బద్దత కల్పిస్తాం.
ప్రతీరోజు మన దేశంలో 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల రుణ మాఫీ చేయడానికి మాత్రం నరేంద్ర మోది ముందుకు రాడు. కాని కొద్ది మంది కార్పోరేట్ కంపెనీలకు మాత్రం ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేశాడు. అందు కే రైతు రుణాలను మాఫీ చేయడం కాకుండా రైతు పండించిన పంటకు ఎంఎస్పీ ( ) కి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామీనాథన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టబద్దత కల్పిస్తాం. కార్మికుల కోసం కనీస వేతనాలను అందిస్తాం.. రోజుకి 400 రూపాయలను అందిస్తాం. భారత దేశంలో జనాభా విషయానికి వస్తే ఇందులో 50 శాతం వెనుకబడిన వర్గాలు, 15 శాతం దళితులు, 8 శాతం ఆదివాసీలు,15 శాతం మైనారిటీలు ,5 శాతం అగ్రవర్ణ పేదలు ఉన్నారు. ఈ వర్గాలకు సంబందించి ఏ రంగంలో కూడా ఉండే అవకాశం లేనే లేదు. మీడియా రంగంలో మనం వెతికితే ఎవరూ కూడా ఈ వర్గాలకు చెందినవారు లేరు. భారతదేశంలోని అతిపెద్ద 200 కంపెనీలను తీసుకుంటే అందులో ఒక్కరు కూడా ఈ వర్గాలకు చెందిన వారు లేరన్నారు. దేశాన్ని 90 ఐఏయస్ అధికారులు నడుపుతారు. ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే వెనుకబడిన వర్గాలవారున్నారు. దేశంలో 90 శాతం ఉన్న జనాభాకు సరియైన భాగస్వామ్యం లేనేలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం .అప్పడు అసలైన సత్యాలు బయటకువస్తాయన్నారు. ఆర్థిక పరమైన అంశాలకు సంబందించిన సర్వే చేయిస్తాం.. అప్పుడు అసలు భారతదేశంలో ఎవరి దగ్గరి ఈ ధనం మూలుగుతోందో అర్థమవుతుంది. అనంతరం ఆ రంగాల్లో వాస్తవంగా ఉండాల్సిన వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు.
* కేసీఆర్ వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారు
మాజీ సీఎం తన ప్రభుత్వ హయాంలో వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఇంటలీజెన్స్ , పోలీస్ వ్యవస్థలను తన స్వార్ధానికి ఉపయోగించాడు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం తీసుకెళ్ళి నదిలో పడేశారు. కేసీఆర్ పాలనా అంతా భయభ్రాంతులకు గురి చేయడం బ్లాక్ మొయల్ చేయడంతోనే సరిపోయందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విరుద్దంగా కేసీఆర్ పనిచేశాడు. మేడిన్ చైనాను మించి మేడిన్ తెలంగాణ నిలబడాలని కోరుకుంటున్నాను.
* విద్వేషం మోది ఎజెండా
కేంద్రంలో నరేంద్ర మోది కూడా వ్యవస్థలను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. ఈడీ, సీబీఐ. ఐటీ సంస్థలు కేవలం నరేంద్రమోది కోసం పనిచేసే విదంగా
మార్చుకున్నాడు. చివరకు ఎన్నికల కమిషన్ లో కూడా నరేంద్రమోది మనుషులు ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ అన్నారు. నరేంద్రమోది కేవలం 3 నుంచి 4 శాతం వర్గాలకు మాత్రమే పనిచేస్తారు. ప్రజాస్వామ్యం , రాజ్యాంగం పరిరక్షణకే చేసే పోరాటేమే ఇది అన్నారు. నరేంద్ర మోది విద్వేషం తో కూడిన రాజకీయాలను తిప్పికొట్టి అన్ని వర్గాలు ఒక్కటిగా నిలిచిన తెలంగాణ స్పూర్తి మొత్తం దేశానికి ఎంతో అవసరం అని రాహుల్ గాంధీ అన్నారు.
———————–