
* లేదా ఢిల్లీలో నిరాహాదీక్ష చేయండి
* బీసీ బిల్లుపై చర్చలో కేటీఆర్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : బీసీ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే బీసీ బిల్లుకు అర్దగంటలో పరిష్కారం లభిస్తుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చలో కేటీఆర్ మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తమ సపోర్ట్ ఉంటుందని అన్నారు. బీఆర్ ఎస్ తరపున బీసీ రిజర్వేషన్ల బిల్లుకు వంత శాతం మద్దతు ఉంటుందని కేసీఆర్ అన్నారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ, సామాజిక స్థితిగతులు లేవన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను శాస్త్రీయంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేటీఆర్ బదులిచ్చారు. అయితే బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన ఇంటింటి సర్వేలో రాష్ట్రంలో ఉన్న బలహీనవర్గాల సంఖ్య 52 శాతంగా తేలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 6 శాతం ఎలా తగ్గిందని కేటీఆర్ ప్రశ్నించారు. తాము పాల్గొనకపోతేనే 6 శాతం తగ్గుతుందా ? అని ప్రశ్నించారు.. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకోసం అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్ చేశారు.
…………………………………….