
– వరద నీటి ఉధృతి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
ఆకేరున్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వాననీటి ఉధృతికి ట్రాక్ ధ్వంసమైంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే పద్మావతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో అటుగా ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.