Raiparthy Independence Day Celebrations
ఆకేరు న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు వివిధ గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో సాగాయి.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఓ) కార్యాలయంలో ఎంపిడిఓ పాక శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ యం. శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ముత్యం రాజేందర్ జాతీయ జెండాను ఎగరవేసి, పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఈదుల కంటి రవీందర్ రెడ్డి,జాతీయ జెండాను ఎగుర వేశారు అమరవీరుల స్తూపం వద్ద బీ ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగుర వేశారు రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి, జాతీయజండ ఎగురవేశారు
* గ్రామాల్లో, పాఠశాలల్లో మిన్నంటిన వేడుకలు
మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగరేసి, వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
