Warangal Officer Surekha Death
* కటుంబంలో వరుస విషాదాలు కుమారుడు, భర్త తర్వాత సురేఖ
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణిగా పనిచేస్తున్న సురేఖ (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె కుటుంబంలో మూడేళ్లలో జరిగిన మూడు వరుస మరణాలు విషాదాన్ని మిగిల్చాయి.
* పోలీసుల కథనం ప్రకారం
సురేఖ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం హనుమకొండలోని తన నివాసం నుంచి బోగత జలపాతానికి వెళ్తున్నారు. ములుగు జిల్లా పాలంపేట వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన సురేఖను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
సురేఖ కుటుంబంలో మూడేళ్ల క్రితం కుమారుడు సుర్జీత్ (15), నాలుగు నెలల క్రితం భర్త అనారోగ్యంతో మరణించారు. ఈ వరుస విషాదాల నుంచి కోలుకోకముందే సురేఖ మృతి చెందడం కుటుంబసభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గూడెప్పాడ్ మార్కెట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేఖ భౌతికకాయాన్ని పోస్టుమార్టం కోసం హనుమకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సురేఖ మృతిపట్ల వరంగల్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
