Raiparthy SC Cell President
* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కందికట్ల యాకయ్య నియామకం
* నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఆకేరు న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కందికట్ల యాకయ్య నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల కందికట్ల యాకయ్య హర్షం వ్యక్తం చేస్తూ, రాయపర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పార్టీ అగ్ర నాయకత్వానికి, స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పాలకుర్తి ఎమ్మెల్యే మా మిడాల యశస్విని రెడ్డి, టి పీ సీ సీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మరియు వరంగల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు చిలువేరు శ్రీనివాసులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా, తనకు నిరంతరం అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్యానాయక్, మరియు రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదుల కంటి రవీందర్ రెడ్డి,కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
* పార్టీ బలోపేతమే ధ్యేయం.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని యాకయ్య పేర్కొన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని స్పష్టం చేశారు
