ఆకేరున్యూస్, వరంగల్: గత నెల 18న అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో దుప్పటికి పాల్పడిన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులు ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు సహా మరో నలుగురు నిందితులు పరార్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుండి సుమారు రూ.కోటి 80 లక్షల 4000 రూపాయల విలువ గల రెండు కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, రూ.10,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబకిషోర్ రaా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిందితుల వివరాలను మీడియాకు వెల్లడిరచారు. ఈ దొంగల ముఠా ముందుగా గూగుల్ యాప్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించి వారికి అనుకూలంగా ఉన్న బ్యాంకులో చోరీ చేసేందుకు ఒక ప్రణాళిక రచించుకొని చోరీ చేస్తారని తెలిపారు.
దానిలో భాగంగానే నవంబర్ 18న అర్ధరాత్రి రాయపర్తి ఎస్బిఐ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న మూడు లాకర్లను ఈ మూట తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టలను వినియోగించి లాకర్ కట్ చేసినట్లు తెలిపారు. అందులో ఉన్న సుమారు 13 కోట్ల 61 లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని తెలిపారు. అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని చోరీ చేసిన సొత్తును ఏడు సమాన వాటాలుగా పంచుకున్నారని.. నవంబర్ 19న నిందితులు మూడు బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కి వెళ్లిపోయారన్నారు. ఈ భారీ చోరీపై అప్రమత్తమైన వరంగల్ కమిషనర్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు. వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ నేతృత్వంలో పదికి పైగా బృందాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించుకొని నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు వేగవంతం చేసి ముగ్గురు నిందితుని గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడిరచారు.
……………………………………………