
ఆకేరున్యూస్, హైదరాబాద్ : గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి ఆశించిన రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎన్ రాంచందర్ రావును ఎంపిక చేయడంతో మనస్తాపానికి గురైన రాజాసింగ్ గత నెల 30 న తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపించిన విషయం తెల్సిందే..బీజేపీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తుందా లేదా అనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఈ మేరకు రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. తాను ఏ పదవి ఆశించి బీజేపీలో చేరలేదని హిందూత్వాన్ని రక్షించాలనే కోరికతోనే బీజేపీలో చేరానని గత 11 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నానని రాజాసింగ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
………………………………………………………..