* సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్(Actor Rajendraprasad) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి(Gayatri) అకస్మాత్తుగా మృతి చెందారు. 38 ఏళ్ల కుమార్తె ఇలా సడెన్‌గా చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో షాక్‌కు గురైంది. చాతీలో నొప్పి ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రి(Aig Hospital)లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గాయత్రి పార్దీవ దేహాన్ని రాజేంద్రప్రసాద్ ఇంటివద్ద (ఇందు ఫర్చున్ విల్లా 226) ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు. నటులు శివాజీరాజా, సాయికుమార్, కాదంబరి కిరణ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తదితరులు రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు.
………………………