* సీపీ సుధీర్ బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కమిషనర్ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికార్లతోపాటు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశమని.. ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సీపీ సూచించారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
