* మంత్రులు సీతక్క, ఎమ్మెల్యేలు కూడా..
* రాష్ట్రంలో రాఖీ సందడి
* సీతక్కతో నా అనుబంధం.. వెన్నెలంత చల్లనిది : రేవంత్
ఆకేరు న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండగ ఆనందోత్సాహాల మధ్య సాగుతోంది. ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆనందంగా వెళ్తున్నారు. ఇటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ పండగ సందడి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM RevanthReddy)కి వరంగల్ ఎంపీ కడియం కావ్య(MP Kadiam Kavya), మంత్రి సీతక్క (MInister Seethakka)రాఖీ కట్టారు. సోమవారం జూబ్లీహిల్స్(Jubilihills)లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో వారితో పాటు ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి(Parnikareddy), రాగమయి(Ragamayi) సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద(Neralla Sarada) కూడా రేవంత్‌కు రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క రేవంత్ మనవడికి కూడా రాఖీ కట్టారు. ‘సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు.. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని.. మనసారా కోరుకుంటున్నాను’ అని రేవంత్ రెడ్డి(Revanthreddy) ట్వీట్ చేశారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
