Ram Charan Hanuman Varanasi
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగా డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కలయికలో రాబోతున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ బర్తడే సందర్భంగా రిలీజైన రెండు పోస్టర్ లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక దర్శకుడు రాజమౌళి కూడా అందుకు తగినట్లుగా ..సున్నితత్వం కాదు సమయం వచ్చినప్పుడు రుద్రుడిని కూడా చూడొచ్చంటూ మరింత హైప్ పెంచేశారు. అలాంటి క్యారెక్టర్ కనుకు ఉంటే మహేష్ ఒక్కడే చేయగలడంటూ ప్రశంసించారు.
* హనుమంతుడెవరంటే…
మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా డబుల్ రోల్ లో కనిపిస్తారు. సహజంగా రాముడు పాత్ర ఉంటే.. హనుమంతుడి పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. వారణాసి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డే ఉంది ఈరోజు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో వేచిచూడాల్సిందే.
* వారణాసి క్లెమెక్స్ భారీగా
వారణాసి క్లైమాక్స్ సీన్ ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లతో నిర్మాణమవుతోంది. కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాత బాధ్యతలు వహిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. దేవా కట్టా మాటలు అందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
