Ramayana Part 1 Release Date
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బాలీవుడ్ రామాయణ.. రూ. 4 వేల కోట్లతో భారీగా రూపొందుతున్నది ఈ సినిమా. బాలీవుడ్ నటుడు రణభీర్ కపూర్, టాలీవుడ్ నటి సాయి పల్లవి సీతారాముల పాత్రలను పోషిస్తున్నారు. నతీష్ తివారీ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పటికే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పింది.
* పార్ట్ 1 రిలీజ్ తేదీ ప్రకటన.. ఆరోజే రణబీర్ కుమార్తె బర్త్ డే
నవంబరు 6న రామాయణ పార్ట్ 1 ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది దీపావళి, రెండో పార్ట్ ను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేస్తామని బృందం ఇది వరకే వెల్లడించింది. అనుకున్నట్లే తేదీని ప్రకటన చేసింది. తొలి భాగం ప్రపంపవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇదే రోజు రణబీర్ కుమార్తె బర్త్ డే కావడం విశేషమని చెప్పవచ్చు.
* మండోదరిగా కాజల్ అగర్వాల్..
ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నది. ఇందులో రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కాజల్ కనువిందు చేయనున్నారు. ఇప్పటికే సూర్పణకగా రకూల్ ప్రీతిసింగ్ నటిస్తుండటం తెలిసిందే. యాష్ రావణుడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
* కాజల్ బిజిబిజీ
ఇటీవల ది ఇండియన్ స్టోరీ అనే సినిమాలో అడ్వకేట్ అర్చన పాత్రలో కనిపించింది. అంతకుముందు మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన కన్నప్పలో కాజల్ .. పార్వతీదేవిగా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రామాయణలో యాక్ట్ చేస్తున్నది. తదుపరి ఉమ అనే లేడీఓరియంటెడ్ బాలీవుడ్ చిత్రం చేయనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
