Rapthadu School
* పదో తరగతి గదిలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి
* మరో విద్యార్థిపై దాడికి యత్నం.. పాఠశాలలో భయాందోళనలు
* విద్యార్థులను ఇళ్లకు పంపించిన పాఠశాల సిబ్బంది
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి పదో తరగతి విద్యార్థిపై చెట్లను కత్తిరించే కట్టింగ్ మిషన్తో దాడి చేశాడు. ఈ ఘటనతో పాఠశాల ఆవరణలో తీవ్ర కలకలం రేగింది.
కాగా పాఠశాలలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించాడు. అతడిని పనివాడిగా భావించిన సిబ్బంది, ఇతరులు అడ్డుకోలేదు. అనంతరం పదో తరగతి విద్యార్థిపై కట్టింగ్ మిషన్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
*మరో విద్యార్థిపై దాడికి యత్నం..
దాడి అనంతరం మరో వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలోని విద్యార్థులందరినీ వెంటనే ఇళ్లకు పంపించారు.
*ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స..
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ఆవరణలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎలా ప్రవేశించాడు? విద్యార్థిపై దాడికి గల కారణాలేమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

