Hanumakonda Collector Chahat Bajpai directed officials to speed up Thipparoni Kunta bund Development
* అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించాలి
* అధికారులను ఆదేశించిన హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్‌లోని తిప్పరోని కుంట (Thipparoni Kunta Development )చెరువు కట్టపై చేపట్టనున్న బండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.
శనివారం ఆమె మున్సిపల్, సాగునీటిపారుదల, సర్వే శాఖల అధికారులతో కలిసి తిప్పరోని కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కుంట కట్ట ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్న విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
* అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
కుంట విస్తీర్ణం, చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను మున్సిపల్, సాగునీటిపారుదల, సర్వే శాఖల అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. తిప్పరోని కుంట (Thipparoni Kunta Development ) కట్టపై ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వివిధ రకాల మొక్కలతో ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
* వాకింగ్‌కు అనువుగా బండ్ సుందరీకరణ
బండ్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, కట్ట సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా, వాకింగ్‌కు అనువుగా ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పనులను త్వరగా ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజయ్, సాగునీటిపారుదల శాఖ ఈఈ కిరణ్‌కుమార్, డీఈ మధుసూదన్‌రెడ్డి, సర్వేయర్ సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

