ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కి జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో అభ్యసన సామర్ధ్యాల లో 50వ స్థానంలో నిలిచేలా జనగామ జిల్లా కలెక్టర్ కృషి చేశారు. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేలో దేశంలో 50వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర విద్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 781 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా జనగామ జిల్లా 50వ స్థానంలో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయిలో జనగామ జిల్లాకు గుర్తింపు దక్కడం విశేషం. జనగామ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృషి చేసిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆనందం వ్యక్తం చేశారు.
కలెక్టర్ ను అభినందించిన సిఎం
జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష విద్య రంగా అభివృద్ధికి చేసిన కృషిని అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ ను అభినందించారు. ట్విట్టర్ వేదికగా కలెక్టర్ కృషిని సీఎం అభినందించడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
కలెక్టర్ కృషి మరువలేనిది
– కలెక్టర్ ను సన్మానించిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పాలకుర్తి ఎమ్మెల్యే అసెంబ్లీ అంచనాల కమిటీ మెంబర్ మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ను శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. విద్యా రంగం లో జనగామ జిల్లా ను జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్ టీ ఏ మెంబర్ అభి గౌడ్ ఈ సందర్భంగా సన్మానం చేశారు.
………………………………
