* ద్రవిడ రాజుల చరిత్రను వక్రీకరించారు
* రావణ వీణ అవార్డ్స్ ప్రదానోత్సవం
* ఇంటర్ నేషనల్ హిందూ రావణ సేనా వాహిని ఆవిర్భావం
– డాక్టర్ ఆరూరి సుధాకర్
ఆకేరు న్యూస్, వరంగల్ : తరతరాలుగా ద్రవిడ జాతి రాజుల చరిత్రను వక్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రావణాసురుడి కీర్తి వైభవాన్ని మసక బారే టట్లు చేశారు. రావణుడి నిజమైన చరిత్రను ఔన్నత్యాన్ని సమాజానికి ఎలుగెత్తి చాటుతామని ఇంటర్ నేషనల్ హిందూ రావణ సేనా వాహిని ( International Hindu Ravana sena vahini ) కో ఆర్డినేటర్ డాక్టర్ ఆరూరి సుధాకర్ అన్నారు. హనుమకొండలో ఆయన మంగళవారం ఆకేరు న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు.
* రావణుడి ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటుతాం..
ఇప్పటి వరకు రావణాసురుడిని సమాజంలో ఒక విలన్గా నిలబెట్టారు. అదీ నిజమైన చరిత్ర కాదు. రావణాసురుడు ( Ravana ) కూడా ద్రవిడ ప్రజల కోసం పోరాడిన వాడు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పినవన్నీ కూడా కుట్ర పూరితమైనవే.. అందుకే రావణుడి నిజమైన చరిత్రను ఎలుగెత్తి చాటేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. రావణుడికి సంబందించి శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. పురావస్తు ఆధారాలు కూడా లభ్యమైనాయి. రావణుడి కీర్తి వైభవానికి సంబందించి పుస్తకాల రూపంలో త్వరలో నే ప్రజలకు చేరుస్తాం.
* ఇంటర్నేషనల్ హిందూ రావణ సేనా వాహని ఏర్పాటు
గౌతమ బుద్దుడు, సామ్రాట్ అశోక, రావణ ప్రజాపతి లాంటి వారు తమ బోధనలు, పాలనా దక్షతతో ప్రంచాన్ని మేల్కొలిపారు. రావణ ప్రజాపతి గౌరవానికి భంగం కలిగించే విదంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి . ఇప్పటికే వ్యక్తిత్వ హననం జరిగిన ద్రవిడ రాజుల నిజమైన చరిత్రను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసమే ఇంటర్నేషనల్ హిందూ రావణ సేనా వాహిని ఆవిర్భావం జరుగుతోంది. ఈ నెల 27న హనుమకొండ హరిత హోటల్ ( Hanumakonda Haritha hotel ) లో ఈ సంస్థ ఆవిర్భావం జరుగుతోంది. ఆది శుక్రాచార్య భగవతీ మహారాజ్ , డాక్టర్ కొండా సుస్మితా పటేల్ , సినిమా డైరెక్టర్ సౌదా తదితరులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నలిగంటి శరత్, మచ్చా దేవేందర్ లకు రావణ వీణా అవార్డ్స్ ప్రదానం చేస్తారని డాక్టర్ ఆరూరి సుధాకర్ చెప్పారు.
—————————————-