* పది మంది దుర్మరణం
* మలేషియాలో జరిగిన ఎయిర్ షోలో కలకలం
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ :
మలేషియాలోని నేవీ ఉత్సవాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేడుకల కోసం రిహార్సల్స్ చేస్తున్న రెండు మిలిటరీ విమానాలు ఆకాశంలో ఢీ కొన్నాయి. క్షణాల్లో కుప్పకూలాయి. ఆ హెలికాప్టర్లలో ఉన్న పది మంది ప్రాణాలు గాలిలోనే కలిసిపోయాయి. మే 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ 90వ వార్షిక వేడుకల్లో భాగంగా నేడు ఎయిర్ షో నిర్వహించారు. రాయల్ మలేషియన్ లో హెలికాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి. HOM (M503-3), Fennec (M502-6) మోడల్స్ హెలికాప్టర్ల రెక్కలు
ప్రమాదవశాత్తు ఒకదానికొటి తాకాయి. దీంతో క్షణాల్లోనే ఆ రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. అందులో ఉన్న పది దుర్మరణం చెందారు. గాలిలో హెలికాప్టర్లు ఢీకొన్ని వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
————————