Rayaparthy Congress Financial Aid
* బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ఆర్థిక సాయం
ఆకేరు న్యూస్, రాయపర్తి: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రెండు కుటుంబాలను పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన రిజ్వాన బేగం ఇటీవల మృతి చెందారు. ఆమె నివాసానికి వెళ్లిన నాయకులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి అవసరాల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా 2వ వార్డు మాల కాలనీకి చెందిన ఉబ్బని ఎల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి అర్పించిన నాయకులు, కుటుంబానికి రూ.2,500 సాయం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు పార్టీ తరఫున తక్షణ సహాయం అందిస్తామని తెలిపారు.
* పాల్గొన్న నాయకులు
టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, మచ్చ నీలయ్య, ఉపసర్పంచ్ మచ్చ రమేష్, వర్ధన్నపేట ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎండీ నయీమ్, కుంట ప్రభాకర్, వినోదా, ఉబ్బని నవీన్, ఎండీ సలీమ్, సర్వర్, సత్తార్, కమాటం వీరాస్వామి, రఫీ, చాంద్ పాషా, మన్నన్, ఉబ్బని బాబు, మహమూద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

