Free Breakfast Scheme in Rayaparthy ZPHS
* విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ..
ఆకేరు న్యూస్, రాయపర్తి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ప్రధానోపాధ్యాయులు గారే కృష్ణమూర్తి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు ‘హరే రామ కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్’ (వరంగల్) ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకం ఘనంగా ప్రారంభమైంది.
* హరే రామ కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
విద్యార్థులు ఉదయాన్నే ఆరోగ్యకరమైన, పౌష్టికాహారంతో తమ విద్యాభ్యాసాన్ని సాగించాలనే సత్సంకల్పంతో ట్రస్ట్ మేనేజర్ రమేష్, ప్రతినిధి రమేష్ నాయక్ ల ఆధ్వర్యంలో ఈ అల్పాహార కార్యక్రమం , ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారే సయేంద్ర బిక్షపతి, ఉప సర్పంచ్ మచ్చ రమేష్‌లు స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
* పిల్లల చదువుకు ప్రోత్సాహం..
పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సర్పంచ్ సందర్శించి, ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి వెన్నంపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ట్రస్ట్ చేస్తున్న ఈ సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
* పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారే కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని క్రమం తప్పకుండా సకాలంలో పాఠశాలకు రావాలని, పౌష్టికాహారంతోనే మానసిక వికాసం సాధ్యమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వీరభద్ర శర్మ, ఉపాధ్యాయులు ఉప్పలయ్య, ప్రవీణ్ రెడ్డి, రోజా రాణి, రాధ, సురేందర్, పీడీ శ్రీనివాస్, నరసింహులు, సంధ్య, దేవేందర్, స్వప్న, విక్రమ్, సీఆర్పీ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ వీరస్వామి, ఆఫీస్ సబార్డినేట్స్ శోభ, అరుణ, స్కావెంజర్లు విజయ, ఐలమ్మ తదితరులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

