* ఎక్స్‌లో పోస్ట్ చేసిన కెటిఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులనే విషయం మహారాష్ట్ర, రaార్ఖండ్ ఫలితాలతో తేలిపోయిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్ దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తోందని ఆక్షేపించారు. ఈ మేరకు భారాస సోషల్ విూడియాలో పోస్ట్ చేసింది. ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఘోర ఓటమి నుంచి కాంగ్రెస్‌ను కాపాడలేకపోయింది. ఆయన అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదని.. ఇకనైనా తెలంగాణలో గెలిపించిన ప్రజల కోసం, వాళ్లకు ఇచ్చిన హావిూలు నెరవేర్చటం కోసం రేవంత్ పనిచేయాలన్నారు.
……………………………………………..