* భూములు ఇవ్వం అన్నందుకు..
కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారు
* బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
* పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
ఆకేరున్యూస్, హైదరాబాద్: బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ( PATNAM NARENDER REDDY) జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూములు ఇవ్వం అన్నందుకు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తున్నారన్నారు. కొడంగల్‌లో సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి.. కాంగ్రెస్ పాలనలో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చక్రవర్తి, నియంత కాదు.
సొంత నియోజకవర్గమైతే అదేమైనా మీ సామ్రాజ్యమా ?నాడు శిశుపాలుని పాపాలు లెక్క పెట్టినట్టు.. నేడు రేవంత్ పాపాలను ప్రజలు లెక్క పెడుతున్నారన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరిట దౌర్జన్యాలు చేస్తున్నారని.. తమ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఇవ్వబోమన్న ఒకే ఒక్క మాటకి.. 30 మందికి పైగా రైతులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. వారి కుటుంబాలకు మేం ఒక్కటే చెబుతున్నాం.. విూరు భయపడాల్సిన అవసరం లేదు.. విూ వెనక కేసీఆర్ ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
