* రిమాండ్ కు తరలింపు
ఆకేరు న్యూస్, హనుమకొండ : నిన్న కుమార్ పల్లి లోని డిజి స్మైల్ స్కూల్ కరెస్పాండెంట్ పై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విద్యా సంఘాల మహా సభల సందర్భంగా చందా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్ , కార్యదర్శి మహేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
