
* లగచర్ల ఘటనపై సిపిఎం విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ఎన్నికల ముందు చెప్పి నేడు అధికారం చేపట్టాక మాట మార్చాడని సీపీఎం (CPM) పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (veerabadram) అన్నారు. గురువారం తమ్మినేని ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా లగచర్లలో వామపక్ష నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రగతి భవన్ ముందున్న గేట్లు కూల్చి వేశాడు. అదొక్కటి తప్పా ఆయన చేసే పనులన్నీ అప్రజాస్వామ్యకంగానే నడుస్తున్నాయన్నారు. హైడ్రా కూల్చి వేతలు, మూసీ పరివాహక ప్రాంతం, గ్రూప్ వన్ ఎగ్జామ్, దామగుండం ఇలా ప్రతి పనిని ఏకపక్షంగా చేశారని మండిపడ్డారు. లగుచర్లలో ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. గతంలోనే ఫార్మా సిటీ కోసం 13 వేల ఎకరాలు సేకరించారు. దానిపై రేవంత్ రెడ్డి వైఖరేంటో చెప్పాలన్నారు. ఇప్పుడు మళ్లీ లగుచర్లలో 13 వందల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందని విమర్శించారు.
………………………………………………