Published:
Updated: 22 Nov 2024 • 04:11 AM
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఆప్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ నిరసన చేపట్టింది.ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కైలాష్ గహ్లాట్ ఈ నిరసనకు నేతృత్వం వహించారు. సీఎం అధికార నివాసం ఆధునీకరణకు రూ.45 కోట్లు ఖర్చు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అరవింద్ కేజ్రీవాల్ నివసిస్తున్న బంగ్లా వద్దకు బీజేపీ నేతలు, వందలాది కార్యకర్తలు చేరుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
……………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
