
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
* ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపణ
ఆకేరున్యూస్ ఖమ్మం ః బీఆర్ ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటితో పాటు ఉపముఖ్యమంత్రి మల్ల మట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డిల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారని తన పదవికి ఈ ముగ్గురు మంత్రుల వల్ల ముప్పు ఉందని సీఎం భయపడుతున్నారని అన్నారు. అందుకే ఈ ముగ్గురు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.
లోకేష్ ను కలిస్తే తప్పేంటి..?
తాను ఏపీ మంత్రి లోకేష్ ను కలిసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తాను లోకేష్ ను కలువలేదని అయినా లోకేష్ ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. లోకేష్ ను అర్దరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. లోకేష్ తనకు మంచి మిత్రుడు అని చెప్పుకొచ్చారు.
రేవంత్ పిరికోడు
సీఎం రేవంత్ రెడ్డి పిరికోడు అని చర్చకు చమ్మంటే రాకుండా తప్పించుకుతిరుగుతాడని ఎద్దేవా చేశారు. బనకచర్లపై ఏపీతో చర్చించేదిలేదని బీరాలు పలికి మళ్లీ ఢిల్లీలో చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్నారని ఆరోపించారు. గోదావరి జలాలను ఏపికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.బనకచర్ల విషయంలో బీఆర్ ఎస్ చూస్తూ ఊరుకోదని అవసరమైతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
…………………………………………..