* నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
* ఇంగ్లండ్ మాజీ ప్రధానితో భేటీ
* రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ
* ఏఐసీసీ పెద్దలను కలువనున్న సీఎం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మామూలుగా అయితే సీఎం ప్రధానిని కాని కేంద్ర మంత్రులను కాని కలిసేందుకు వెళ్తారు.ప్రభుత్వపరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర ప్రాజెక్టులపై చర్చించేందుకు లేదా నిధులు అడిగేందుకు ఇతర అనుమతులు తీసుకునేందుకు వెళ్తుంటారు. లేదా పార్టీ పరంగా వెళ్లినప్పడు ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు వెళ్తారు.. కానీ ఈ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో పాల్గొంటారని సమాచారం. టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) అనే ఎన్జీవోను నడిపిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన భేటీలో టోనీబ్లెయిర్తో పలు విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా టోనీబ్లెయిర్తో సమావేశమవుతారని తెలియవచ్చింది. టోనీ బ్లెయిర్ తో భేటీ అనంతరం సీఎం ఏఐసీసీ పెద్దలను కలిసి రాష్ట్రవ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
