* హరీశ్ రావు సవాల్‌కు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
* ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణ మాఫీ చేసి తీరుతా..
* దేవుడు గుడిలో ఉండాలి- భక్తి గుండెల్లో ఉండాలి
* వరంగల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ , వరంగల్ : వరంగల్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సారిగా ఊగిపోయారు.. రైతుల రుణ మాఫీకి సంబందించి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబందించి తీవ్ర స్థాయిలో స్పందించారు.
హరీశ్ రావ్ .. వరంగల్ వేదిక సాక్షిగా నేను మాట ఇస్తున్నా .. మాట ఇస్తే తప్పేటోన్ని కాదు. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాల సాక్షిగా , సమ్మక్క, సారక్కల సాక్షిగా మాట ఇస్తున్నా .. వచ్చే ఆగష్టు 15 లోపు రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాను.. భూమి ఆకాశం తిరగబడ్డా.. తుఫానులొచ్చినా , భూకంపాలొచ్చినా వెరవకుండా రైతులకు రుణ మాఫీ చేసి తీరుతా.. సవాల్ స్వీకరిస్తున్నా అని మాటలతో చెప్పడం కాదు.. హరీశ్ రావు నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో .. మీ మామ లాగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాటతప్పి నట్టు కాదు.. నేను మాట ఇస్తే నిలబడుతా.. అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే హరీశ్ రావు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
* దేవుడు గుడిలో ఉండాలి- భక్తి గుండెల్లో ఉండాలి
మతం, కులం, ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ ప్రయోజనాలు పొందుతోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకోసం అన్ని రకాలుగా ఆలోచించి సోనియా గాందీ, మన్మోహన్ సింగ్ మన తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ , గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబందించిన హామిలను రాష్ట్ర విభజన ఒప్పందంలో పొందు పరిచారు. బీజేపీ మాత్రం వాటిని అమలు చేయలేక పోయింది. ఎంతో కాలం పోరాడితే ఇటీవలనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అగ్గిపెట్టే , సబ్బు బిల్లా చివరకు అగరు వత్తులను కూడా వదలకుండా జీఎస్టీ పన్నలు వేస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు. చెప్పితే నమ్మెటోడు లేడు. అందుకే బీజేపీకి మత పిచ్చి పట్టుకున్నదని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. బీజేపీ నాయకులు మాత్రం మతం , దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు..ఇంత చేసినా వరంగల్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ దొరకలేదు. ఊరూరా మీ భూములు లాక్కున్న అనకొండ ఆరూరి రమేశ్ కాదా అని ప్రజలను అడిగారు. పార్టీ మార్చినా వేషం మార్చినా వరంగల్ ప్రజలు గుర్తుపట్టలేరా అని రేవంత్ రెడ్డి ప్రజలను ప్రశ్నించారు.. కడియం శ్రీహరి నుంచి నీతి , నిజాయితీ వారసత్వంగా తీసుకుని డాక్టర్‌గా పేద ప్రజలకు సేవలు చేసినా కడియం కావ్య ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
——————————————-