* సీఎల్పీలో నాలుగు కీలక అంశాలపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY అధ్యక్షతన నేడు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) భేటీ జరగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందజేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సీఎల్పీ (CLP) భేటీలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని, గ్రూపుల వారీగా దీని ఫలితాలు అందుతాయని ప్రకటించింది. ఈక్రమంలో దీనిపై చర్చ జరగనుంది. అలాగే సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నాలుగు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి జపాన్ (JAPAN) పర్యటనకు బయల్దేరనున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
