Thorrur
Thorrur| ఆకేరు న్యూస్, తొర్రూరు: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ‘ఓటు చోరీ’ ఆరోపణలను నిరసిస్తూ తొర్రూరు అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు ఫైండ్ల రాజేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేసే ముందు సంబంధిత ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే ఆధారాలతో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలుపుల శంకర్, జిల్లా నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి నడిగడ్డ సందీప్, మంగళపల్లి యాకన్న, వెలగపూడి శోభారాణి, గట్ల భరత్, గంధం రాజు, తూర్పాటి విశాల్, గుండా సురేష్, నిమ్మల సంపత్, భాస్కర్, ధరావత్ తేజస్, BJYM నాయకులు కాగు నవీన్, నూకల నవీన్, శీలం శ్రీనాథ్, శ్రీనివాస్ చారి, తాడిశెట్టి నవీన్, కొండపల్లి శ్రీనివాస్, నిరుగొండ అనిల్, తూర్పాటి వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
