* మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదు
* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఆకేరు న్యూస్ వరంగల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడచులకు క్షమాపణ చెప్పాలని నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం హన్మకొండలో ని వేయిస్తంభాల గుడిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు మంత్రులు జూపెల్లి కృష్ణారావు,సీతక్క, కొండా సురేఖలు తెలంగాణ ఆడపడచులకు క్షమాపణ చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు. బతుకమ్మ వేడుకలను రాజకీయ చేశారని బతుకమ్మ వేడుకలను కాంగ్రెస్ పార్టీ వేడుకలుగా మార్చారని పెద్ది ఆరోపించారు. బతుకమ్మ వేడుకలపై మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదని పెద్ది అన్నారు. రాష్ట్రంలో రైతాంగం యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆడబిడ్డలు చంటి పిల్లల్ని ఎత్తుకొని యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారని పెద్ది అన్నారు. యూరియా కొరత వల్ల ఈ ఏడాది పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఎన్నికల మందు రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణం చేసి మాట తప్పినందునే అతి వృష్టి అనావృష్టి పరిస్థితులు తలెత్తాయని పెద్ది అన్నారు. రేపు మేడారంలో సీఎం పర్యటిస్తున్నందున
సమ్మక్క సారక్కల సాక్షిగా చేసిన తప్పులను ఒప్పుకోవాలని పెద్ది సూచించారు. మేడారం జాతర సమీపిస్తున్నందున్న గోదావరి జలాలతో లక్కవరం చెరువును జంపన్న వాగు నింపాలని డిమాండ్ చేశారు.
…………………………………………………..
