
వరంగల్‌కు రానున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత రేవంత్ వరంగల్‌లో రెండు భారీ బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ముచ్చటగా మూడోసారి నేడు మరో సభలో ప్రసంగించనున్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రేపు వరంగల్ పర్యటనకు రానున్నారు.
—————-