*ఆర్జీవీ సంచలన కామెంట్స్.
.
* విద్యార్థుల్లారా.. మేల్కొండి.. అంటూ..
* ఆలోచనలో పడేసిన ఆయన మాటలు
*ట్వీట్‌తో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో తీవ్ర చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాం గోపాల్ వర్మ సంచన కామెంట్స్ చేశారు. AI విప్లవం ముందు విద్య చనిపోతుంది. విద్యార్థుల్లారా మేల్కొండి అంటూ.. ప్రముఖ దర్శకుడు ఆర్జీవి చేసిన ట్వీట్ సంచలనమవుతోంది. AI ఒక్క క్లిక్‌తో లక్షల కేసులను విశ్లేషిస్తోందని..విద్యార్థులు ఎందుకు 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని గడపాలి..? అని ప్రశ్నించారు. మార్పు చెందని వ్యవస్థను చెరిపేస్తోంది అంటూ ఆయన హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు AI విస్ఫోటనంతో AI విశ్వవిద్యాలయాలు.. బోర్డులు సిద్ధం చేసే వరకూ వేచి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలలు విద్యా విధానాన్ని మార్చి ఏ1ని పరీక్షల్లో సహాయక సాధనంగా అనుమతించాలని సూచించారు. ఏ1 మిమ్మళ్లీ చంపదు.. పట్టించుకోదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విద్యార్థల్లో చర్చకు దారితీస్తోంది.
