
* ఆ జిల్లాలో మాత్రం దొడ్డి బియ్యమే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం (Fine Rice) పంపిణీ మొదలైంది. కొత్త ఉత్సాహంతో ఈరోజు ఉదయం నుంచే లబ్ధిదారులు దుకాణాల ముందు క్యూ కట్టారు. రేషన్‌కార్డులో ఉన్న వారందరికీ ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున అందజేస్తున్నారు. ఎన్నికల కోడ్ (Election Code) ఉండడంతో హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి బ్రేక్ పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ (Hyderabad) మినహా మిగతా జిల్లాలో పంపిణీ మొదలైంది. ఈ బియ్యం కోసం కిలోకు 40 రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోందని ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు.
………………………………………………………………