తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన నాలుగు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం
*లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం
* మృతుల్లో చిన్నారి
* పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా విషాదం
* పఠాన్ చెరులో మరో ప్రమాదం
* ఇద్దరు సజీవ దహనం?
ఆకేరు న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ఆ కుటుంబంలో పుట్టెడు దుఃఖం మిగిలింది. రోడ్డుప్రమాదం వారిని కబళించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా.., ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు ఒదిలారు.
చిన్నారికి పుట్టువెంట్రకలు తీయించేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయానికి ఓ కుటుంబం కారులో బయలుదేరింది. కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో దానిని డ్రైవర్ రోడ్డుపైనే ఆపేసినట్లు తెలిసింది. కారులో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నారు. మితిమీరిన వేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతుల్లో మాణిక్యమ్మ, చంద్రరావు , స్వర్ణ, శ్రీకాంత్, లాస్య ఉన్నారని, వీరంతా బోనకల్లు మండలం ఎల్ గోవిందాపురంకు చెందిన వారిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పఠాన్‌చెరులో మరో విషాదం
పఠాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిట్ – 3 వద్ద రింగ్ రోడ్డుపై వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు దహనమైంది. లారీకీ మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కారులో ఉన్న ఇద్దరు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
