* విచారణ కమిటీ ఆరా..!
* జిల్లా ప్రధానాసుపత్రిలో నిధుల గోల్మాల్ను
* వెలుగులోకి తెచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
* జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జరిగిన రూ. 4.50 కోట్ల అవినీతిపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ నుండి వచ్చిన కమిటీ ఆరా తీసింది. విజిలెన్స్ కమిటీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ రాతపూర్వకంగా అందించిన నివేదిక ఆధారంగా ఎంక్వరీ చేపట్టారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 2021 నుండి 2024 వరకు 4.50 కోట్లు రూపాయలు అవినీతి క్రమాలకు పాల్పడ్డ అప్పటి సూపరింటెండెంట్లు, డాక్టర్లను సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలనీ, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ నవీనలను కరీంనగర్ హాస్పిటల్ నుండి తొలగించాలని కోరారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెందిన రూ.4,50,00,000/- దుర్వినియోగం చేయడం వంటి కుంభకోణంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ అజయ్ ప్రసాద్, డాక్టర్ నవీస, డాక్టర్ మొహమ్మద్ అలీమ్, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతి గార్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అప్పటి విచారణ అధికారి డాక్టర్ కె. లలితా దేవి 08-01-2024న కరీంనగర్ లోని అప్పటి DMHO డా॥ లలితాదేవి విచారణ నివేదిక కాపీ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న అధికారులపై చట్టపరమైన మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఇన్ని కోట్లు అవినీతికి పాల్పడిన డాక్టర్ కృష్ణప్రసాద్ ఇప్పటికీ TVVP సూపరింటెండెంట్‌గా కొనసాగడం అశ్చర్యానికి గురి చేస్తుంది. డాక్టర్ నవీన TVVP నుండి జీతం తీసుకుంటూ DCH హాస్పిటల్లో RMO గా కొనసాగడం తన సాధారణ విధులతో సంబంధం లేకుండా ఆసుపత్రి పరిపాలన విషయాల్లో పాల్గొంటూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు వారి ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అవినీతికి నిదర్శనమని బండారి శేఖర్ చెప్పారు.
అవినీతికి పాల్పడిన అధికారులు ఎటువంటి బిల్లులు సమర్పించకుండా ఒకరితో ఒకరు కుమ్మక్కయి గొలుసు చర్యలో పాల్గొన్నారని రిపోర్టులో ఉన్నది. 2021 నుండి 2024 వరకు కరీంనగర్ జిల్లా జనరల్ హాస్పిటల్‌లోని అప్పటి సూపరింటెండెంట్ మరియు ఇతర వైద్యులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS) నిధులు, కాయకల్ప, TVVE, TSMSIDC, మరియు ఆసుపత్రి నిర్వహణ కోసం డీజిల్ మరియు పెట్రోల్ ఖర్చులు వంటి అనేక విభాగాల కింద 4.50కోట్లు రూపాయలు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డ డాక్టర్ కృష్ణ ప్రసాద్ (అప్పటి సూపరింటెండెంట్, జిల్లా జనరల్ హాస్పిటల్, కరీంనగర్ ఇప్పుడు సూపరింటెండెంట్, టీవీవీపీ కరీంనగర్) మరియు డాక్టర్ నవీన (ప్రస్తుతం ఆర్ఎంవో, జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ మొహమ్మద్ అలీమ్, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతిలతో పాటు B.N.S చట్టం సెక్షన్ 316, 317, 318 మరియు అవినీతి నిరోధక చట్టం యొక్క U/ సెక్షన్ 13(1)(c) & (d) నిబంధనల కింద ప్రాసిక్యూట్ చేయబడతారు. పోలీసులకు పిర్యాదు చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. పబ్లిక్ సర్వెంట్స్ ఎంక్వైరీ యాక్ట్, 1950 కింద వారి ఆస్తుల అసమానతపై విచారణ మరియు దర్యాప్తు చేయాలని విచారణ కమిటీని కోరారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
………………………………………….
