
* సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలి
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, స్టేషన్ ఘనపూర్: ఒక్క ఏడాది కాలంలోనే ఒక నియోజకవర్గ అభివృద్ధికి రూ.800కోట్ల నిధులు కేటాయించడం చాలా గొప్ప విషయమని, ఇది మన పైన, మన నియోజకవర్గంపైన ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమకు నిదర్శనమని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు మండల కేంద్రంలోని రెడ్డి కమ్యూనిటీ హల్లో వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మండలలోని ఆయా గ్రామాల నుండి సీఎం సభ జన సమీకరణ పై గ్రామాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేసి, ఈనెల 16వ తేదీన జరిగే సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు మండల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని, అలా చేయని యెడల స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు అడగనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
…………………………………