RTC bus ambulance emergency
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ప్రమాద సమయంలో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ బస్సు అంబులెన్స్ గా మారింది. బస్సులో పిట్స్ (మూర్చ) వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు సహకరించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ ను ప్రయాణికులు అభినందించారు. వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన పూలసుల ఉప్పలయ్య (66) గురువారం వరంగల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పాలకుర్తి నుంచి హన్మకొండకు ప్రయాణిస్తున్నారు. బస్సు స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని అండర్‌బ్రిడ్జ్ వద్ద రాగానే బస్సులో ప్రయాణిస్తున్న ఉప్పలయ్యకు అకస్మా త్తుగా పిట్స్ (మూర్చ) రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.108 అంబులెన్స్‌కు కాల్ చేసినప్పటికీ అది అందుబాటులో లేకపోవడంతో, పరిస్థితిని అంచనా వేసి బస్సునే అంబులెన్స్‌గా మార్చి బాధితుడిని సమీప ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. ప్రయాణికుల విజ్ఞప్తిని గమనించిన డ్రైవర్ కిషన్ రావు ఒక్క క్షణం ఆల స్యం చేయకుండా చర్యలు తీసు కున్నారు. డ్రైవర్ కిషన్ రావు చొరవ చూపి బస్సును నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రికి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నాడు. ఆసుపత్రికి తీసుకువచ్చిన రోగికి వైద్య సేవలు అందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
