* ఓ సైనికుడి భార్య సంచలన ఆరోపణలు
* ఖండించిన రష్యా
ఆకేరు న్యూస్ డెస్క్: యుద్ధంలో చనిపోయిన సైనికు (Soldiers) ల అవయవాల (Organs) ను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఉక్రెయిన్‌కి చెందిన ఓ సైనికుడి (యుద్ధ ఖైదీ) భార్య (Soldier’s wife) చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్నయుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఆ యుద్ధంలో రష్యా చేతిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు స్వదేశానికి తిరిగి వచ్చాక మృతదేహాల్లో కీలక అవయవాలు కనిపించలేదని ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి (the head of the Freedom to Defenders of Mariupol group) లారీసా సలేవా (Larisa Saleva) ఆరోపిస్తున్నారు. రష్యా దురాగతాలకు ఇది పరాకాష్ట అన్నారు. టర్కీ (Turkey) లోని అంకారాలో యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధులు, టర్కీలోని ఉక్రేనియన్ రాయబారి వాసిల్ బోడ్నార్ (Ukrainian Ambassador to Turkey Vasyl Bodnar) తో జరిగిన సమావేశంలో సలేవా ఈ ఆరోపణలు చేశారు. “జైళ్లలో ఉక్రెయిన్ సైనికులను హింసించి చాలా మందిని చంపేశారు. మృతదేహాలను ఉక్రెయిన్‌కి చేర్చారు. శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. అవయవాలు దొంగిలించారని గుర్తించాం. ఇది దారుణం. రష్యా.. అవయవాలు దొంగతనం చేయడంలో బ్లాక్ మార్కెట్‌గా అవతరించింది. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి” అని సలేవా కోరారు. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. తమ బలగాలపై ఉక్రెయిన్ అనవసర ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు.
—————–