Sabarimala Gold Crown Missing
* స్ట్రాంగ్ రూమ్లో బంగారు కిరీటం మాయం
* తనిఖీల్లో వెలుగు చూసిన బారకం..
* అసలు కిరీటం బదులు నకిలీ కిరీటం
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో తీవ్ర కలకలం రేకెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బంగారు కిరీటం మాయమైనట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.
* అందిన వివరాల ప్రకారం..
ఈ కిరీటాన్ని 2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన భక్తులు స్వామివారికి సమర్పించారు. ఆ సమయంలో ఈ కిరీటం బరువును 445.78 గ్రాములుగా (సుమారు 55.72 సవర్లు) రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో స్ట్రాంగ్ రూమ్లో ఉన్న కిరీటాన్ని పరిశీలించగా అది అసలుది కాదని, నకిలీ కిరీటమని తేలింది. అంతేకాకుండా, ప్రస్తుతం అక్కడ ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం.
అమూల్యమైన బంగారు కిరీటం మాయం కావడం మరియు దాని స్థానంలో తక్కువ బరువున్న నకిలీ కిరీటం ప్రత్యక్షమవడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
