Dasara Holidays
* అక్టోబరు 10 నుంచి 22 వరకు
* అక్టోబరు 1 నుంచి ఎస్ఏ-1 పరీక్షలు పూర్తి
ఆకేరు న్యూస్, డెస్క్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా పండుగ సెలవులను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు మొత్తంగా 13 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.
అయితే, ఈ సెలవుల్లో కొన్ని రోజులు ఆదివారాలు మరియు రెండో శనివారం రావడం గమనార్హం. అక్టోబరు 10న రెండో శనివారం కాగా, 11 మరియు 18 తేదీలు ఆదివారాలు వచ్చాయి. వీటిని మినహాయిస్తే విద్యార్థులకు నికరంగా పది రోజులు మాత్రమే పూర్తిస్థాయి సెలవులు లభించనున్నాయి.
మరోవైపు, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఎస్సీఈఆర్టీ (SCERT) సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షల షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలు అక్టోబరు 9వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తయిన వెంటనే అక్టోబర్ 10 నుంచి సెలవులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
