* అనుమానితుడిని ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు
* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(SAIF ALI KHAN)పై దాడి కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్లో అతడిని విచారిస్తున్నారు. ఈ నెల తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్ అలీఖాన్ పైతో పాటు దుండగుడు పనిమనిషిపైనా దాడికి పాల్పడ్డాడు. నిందితుడు దాదాపు 6 చోట్ల కత్తితో దాడిచేయడంతో.. సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రి(LEELAVATHI HOSPITAL)లో చికిత్స పొందుతున్నాడు.
అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, దాడి చేసిన నిందితుడు సైఫ్ ను రూ. కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు అదే ఇంట్లో ఉంటున్న స్టాఫ్ నర్స్ ఇలియామా ఫిలిప్ పేర్కొంది. ఈమె నాలుగేళ్లుగా సైఫ్ అలీఖాన్ ఇంట్లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఏదో శబ్దం రావడంతో నిద్ర నుంచి లేచి చూశానని, బాత్రూం తలుపు తెరిచి, లైట్ వెలగడం చూసి.. కరీనా(KARINA).. జెహ్ ని కలవడానికి వచ్చి ఉంటుందని భావించి మళ్లీ పడుకున్నానని ఆమె వివరించారు. కానీ ఏదో జరిగి ఉంటుందని నాకు కాసేపయ్యాక అర్థమైంది. అంతలోనే నేను ఒక నీడను చూశాను అని ఆమె పోలీసులకు చెప్పింది.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
