* రెండు దేశాల పర్యటన శుభారంభం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండు దేశాల పర్యటన శుభారంభమైంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్‌తో విస్తృత చర్చలు జరిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, Iు పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థికసదస్సులో పాల్గొంటారు.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
