బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో
* కాల్పుల కేసులో కలకలం
ఆకేరు న్యూస్ , ముంబయి : సినీ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఇంటి దగ్గర కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గత నెల 14న ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. వీరికి తుపాకులు సరఫరా చేశాడన్న ఆరోపణలతో అనూజ్ థాపన్ Anuz Thapan ( 23 ),సోనూ సుభాష్ చందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ రిమాండ్లో ఉన్న అనూజ్ బుధవారం టాయిలెట్ గదిలో బెడ్ షీట్ తో ఉరి వేసుకున్నాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనకు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భాద్యుడిగా పోలీసులు గుర్తించారు. మరో వైపు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కాల్పుల సంఘటనకు తామే బాధ్యులమని ప్రకటించుకున్నారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
