* బిల్లులు చెల్లించమంటే అరెస్టు చేస్తున్నారు
* మాజీ సర్పంచ్ల ఆందోళన.. హరీశ్‌రావు అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌లు రోడ్డెక్కారు. పోరుబాట పట్టారు. తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తిరుమలగిరి(Tirumalagiri)లో చేపట్టిన ఆందోళనలో బీఆర్ ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harishrao) కూడా పాల్గొన్నారు. సారా కాంట్రాక్టర్లకు బిల్లులా.. సర్పంచ్(Sarpanch)లకు చిల్లులా అంటూ స్వయంగా నినాదాలు చేశారు. మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి తరలిస్తున్న వాహనం ఎదుట హరీశ్‌రావు నిరసన తెలిపారు. దీంతో హరీశ్‌రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ(Government) తీరుతో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. బిల్లులు చెల్లించమంటే వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆరోరపించారు. కేంద్రం(Central) నుంచి తెచ్చిన నిధులను సర్పంచ్‌లకు పంచడం లేదన్నారు. పెండింగ్ బిల్లలును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
……………………………………………….