ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరాఖండ్(Uttarakhand)లో బస్సు లోయలో పడడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 22 మంది కూడా మృతి చెందారు. తొలుత 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఓవర్ లోడ్(Over Load) కారణంగా బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ(Megisterial Enquiry) జరపాల్సిందిగా కమీషనర్ కుమాన్ డివిజన్ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Chief Minister Puskhar sing dhami) ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఉప్పు కుపి ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రమాదానికి అసలు కారణాలు విచారణ తర్వాతే తెలుస్తాయని కలెక్టర్ అలోక్ కుమార్ పాండే(Collector Alokhkumar Pande) అన్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
