* పెరుగుతున్న భార్యా బాధితులు
* ఇప్పటికే భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
భర్తల వేధింపులపై ఆందోళనలు, కేసులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో భార్యాబాధితులు పెరుగుతున్నారు. నా భర్య నన్ను కొడుతోందని, రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు రోడ్డెక్కారు. మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి అయితే అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడును చెప్పుకున్నాడు.
చిత్రహింసలకు గురి చేస్తోంది..
చిత్రహింసలకు గురి చేస్తోన్న భార్య నుంచి తనని రక్షించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు వచ్చారకు. అదే తరహా ఘటన మరొకటి రాష్ట్రంలో వెలుగు చూసింది. తన భార్య తనని తరచూ చితకబాదుతుందంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. బాన్సువాడలోని రాజారాం దుబ్బాకు చెందిన గంగారాం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే, ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌కు అర్ధనగ్నంగా వెళ్లిన గంగారాం.. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తరచూ తనపై దాడి చేస్తోందని, ఆమెపై కేసు నమోదు చేసి తనని కాపాడాలని వేడుకున్నాడు. అయితే, గంగారాం ఫిర్యాదుకు కంగుతిన్న పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
నా భార్య కొడుతోంది..
తనను కొట్టడంతో పాటు, తల్లిదండ్రులను కూడా మానసికంగా తన భార్య ఇబ్బందులకు గురిచేస్తుందని నగర శివారులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అల్వాల్ ఎస్ఐ శంకర్, భాధితుడు తెలిపిన వివరాల ప్రకరాం…. ఆంధ్రప్రదేశ్ , రాజోలు కు చెందిన టెమూజియన్‌కు అమలాపురం ప్రాంతానికి చెందిన లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త టెమూజియన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండగా , బార్య లక్ష్మీగౌతమి కూడా అదే కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ టెక్నిషీషన్గా పనిచూస్తూ అల్వాల్ల్లోని సూర్యనగర్‌లో నివసిస్తున్నారు. వారికి 5 సంవత్సరాల వయస్సు గల ఒక బాబు ఉన్నారు. అయితే పెళ్లీ అయినప్పటి నుంచి ఆయన బార్య లక్ష్మీగౌతమి తన ఆస్తి, బంగారు అభరణాలు, నగదు కావాలని శారీరకంగా, మానసీకంగా హింసిస్తూ మనోవేధనకు గురి చేస్తుందని భర్త వాపోయాడు. ఈ గొడువల విషయంలో పలుమార్లు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి తన భార్య వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల ఇంట్లో కూరగాయలు తరిగే చాకుతో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో
భార్యాబాధితుల కోసం ఎప్పటి నుంచో ఓ సంఘం కూడా ఉంది. సమాజంలో మానవ హక్కులు, సమాజ శ్రేయస్సు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చట్టాలు చేశాయని ముఖ్యంగా మహిళలకు అనేక రకాల చట్టాలు తెచ్చాయని, పురుషుల కోసం కూడా ప్రత్యేక చట్టాలు రావాలని వారి ఉద్దేశం. మహిళ చట్టాలను కొందరు భార్యలు దుర్వినియోగం చేస్తున్నారని ఆ సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్యలు పెట్టిన కేసుల వల్ల భర్తలు, వారి కుటుంబ సభ్యులు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. భర్తలు అనుభవిస్తున్న ఆవేదనను ప్రభుత్వానికి, పార్లమెంటుకు తెలియజేయాలంటే 7093434730 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలని గతంలో ఓకార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
——————–