* సాయంత్రం 5 గంటల లోపు నివేదిక ఇవ్వండి
* సీఈఓకు సీఈసీ ఆదేశం
ఆకేరు న్యూస్, విజయవాడ : పోలింగ్ రోజున కేంద్రంలోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే.. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిట్ నివేదికతో బయటకు వచ్చిన ఈ వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఈఓను ఆదేశించింది. ఈమేరకు సీఈఓకు నోటీసులు జారీ చేసింది. దీంతో అధికారులు ఎమ్మెల్యే అరెస్టుకు రంగంలోకి దిగారు.
————–