
గుండెపోటుతో సెక్రటేరియట్ ఉద్యోగి మృతి
* గుండెపోటుతో సెక్రటేరియట్ ఉద్యోగి మృతి
* అధికారి చాంబర్ ముందు తోటి ఉద్యోగుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సెక్రటేరియట్ లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. సీనియర్ ఐఏఎస్ వేధింపులే ఆయన మృతికి కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక కార్యదర్శి రాణి కుముదిని దగ్గర పీఏగా రాహుల్ పని చేస్తున్నారు. ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కొన్ని రోజులుగా పని ప్రదేశంలో రాహుల్‌ను రాణి కుముదిని వేధిస్తున్నారని, ఆ ఒత్తిడితోనే రాహుల్ గుండెపోటుతో మృతి చెందారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాణి కుముదిని చాంబర్ వద్ద బైఠాయించారు. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
——————